Anil Kumble: కోహ్లీ తనపై తానే ఒత్తిడి పెంచుకుంటున్నాడు.. 1 y ago

featured-image

తనపై తానే ఒత్తిడిని పెంచుకోవడం వల్లే విరాట్ కోహ్లి ఫామ్లోకి రాలేకపోతున్నాడని భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. విరాట్ మానసికంగా ప్రశాంతంగా ఉండాలని అతడు సూచించాడు. "పామ్లోకి రావడానికి కోహ్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తనపై తానే ఎక్కువగా ఒత్తిడి పెంచుకుంటున్నాడు. ఈ విషయంలో విరాట్ కాస్త ప్రశాంతంగా ఉండాలి. ఓపెనర్గా వచ్చే రోహిత్కు వెనుక బ్యాటర్లు ఉండడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అలాగే విరాట్ తర్వాత కూడా బ్యాటర్లు ఉన్నారు. అందుకే అతడు వేరే విషయాలు పట్టించుకోకుండా ఆటపై దృష్టిసారించాలి"అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD